భారతీయ సినిమా ఇద్దరు దిగ్గజాలు, బిగ్ బి అమితాబ్ బచ్చన్ మరియు ఉలగనాయగన్ కమల్ హాసన్, సుమారు నాలుగు దశాబ్దాల తర్వాత మళ్ళీ కలిసి నటిస్తున్నారు. నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ వండర్ ‘కల్కి 2’ సెట్స్‌లో వీరిద్దరూ కలుసుకున్నారు.

కమల్ హాసన్‌తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. “మహా నటుడు కమల్ హాసన్‌ను కలవడం ఆనందంగా ఉంది. యుగాల తర్వాత మేము మళ్ళీ కలిసి పని చేస్తున్నాం. చివరగా 1985లో వచ్చిన ‘గిరఫ్తార్’ చిత్రంలో కలిశాం” అని అమితాబ్ రాసుకొచ్చారు. 1985లో వచ్చిన ‘గిరఫ్తార్’ సినిమా తర్వాత మళ్ళీ ఇప్పుడు ‘కల్కి’ ప్రాంచైజీలో వీరిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకోవడం సినిమా అభిమానులకు కన్నుల పండుగగా మారింది.మొదటి భాగంలో అమితాబ్ ‘అశ్వత్థామ’గా మెప్పించగా, రెండో భాగంలో కమల్ హాసన్ ‘సుప్రీం యాస్కిన్’గా ప్రధాన విలన్‌గా తన విశ్వరూపం చూపించబోతున్నారు.

