Anantapur districtలో దారుణ ఘటన చోటుచేసుకుంది. Pedda Pappur మండలానికి చెందిన సుధాకర్ తన భార్య శ్రీలేఖను హత్య చేసి మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో పడేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
సమాచారం ప్రకారం, హత్య అనంతరం మృతదేహాన్ని ముచ్చుకోట అటవీ ప్రాంతంలో పడేసిన నిందితుడు తర్వాత స్వయంగా పెద్దపప్పూరు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించారు. ఈ హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
