అనంతపురం నగరంలో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించేందుకు జిల్లా SP జగదీష్ విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీలు శ్రీనివాసులు, మహబూబ్ బాషాతో పాటు సీఐలు, ఎస్ఐలు మరియు పోలీసు సిబ్బందితో కలిసి ఆర్టీసీ బస్టాండ్ సహా పలు ప్రాంతాల్లో పర్యటించారు.

మద్యం మత్తులో జరుగుతున్న సంఘటనలు, అసాంఘిక కార్యకలాపాల నేపథ్యంలో నగర పరిస్థితిని ప్రత్యక్షంగా అంచనా వేసిన ఎస్పీ, ప్రజలకు కీలక సూచనలు చేశారు. రాత్రి 11 గంటల తర్వాత అత్యవసర పని ఉంటే తప్ప బయట తిరగవద్దని హెచ్చరించారు.మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై, శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నేరస్తుల వివరాలు సాంకేతికంగా ట్రాక్ చేస్తూ, వేలిముద్రల ఆధారంగా త్వరగా గుర్తిస్తామని తెలిపారు.అనంతపురంతో పాటు తాడిపత్రి, గుంతకల్ వంటి ప్రధాన పట్టణాల్లో కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వివరించారు.

