ఆర్టీసీ ఉద్యోగులు మరియు వారి కుటుంబాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో శుభవార్త ప్రకటించింది. తిరుపతిలో కొత్త, ఆధునిక సౌకర్యాలతో కూడిన వైద్యారోగ్య డిస్పెన్సరీని నిర్మించి, ఉచిత వైద్య సేవలు అందించే అవకాశం కల్పించారు. పాత భవనం శిథిలావస్థకు చేరడంతో దాని స్థానంలో నూతన భవనం నిర్మాణం పూర్తయ్యింది. ఈ డిస్పెన్సరీ ఈ నెల 30న ప్రారంభం కానుంది.
ప్రారంభోత్సవానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ఎండీ ద్వారకా తిరుమలరావు హాజరుకానున్నారు. కొత్త డిస్పెన్సరీ ద్వారా తిరుపతి జిల్లా 11 డిపోల ఉద్యోగులు, చిత్తూరు జిల్లా పరిధిలోని ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు కలిపి సుమారు 6,000 కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి.
1.3 ఎకరాల స్థలంలో రూ.3.89 కోట్లతో జీ+3 అంతస్తుల భవనం ఆధునిక సౌకర్యాలతో,గ్రౌండ్ ఫ్లోర్‌లో పార్కింగ్, మొదటి అంతస్తులో డిస్పెన్సరీ,రెండవ, మూడవ అంతస్తుల్లో గెస్ట్‌హౌస్,పెద్ద వెయిటింగ్ హాల్ (50 మందికి పైగా), ఫార్మసీ, ఓపీ కేంద్రం
వైద్యుల కోసం ప్రత్యేక గదులు, వృద్ధులు, రోగుల కోసం లిఫ్ట్ ,ఉచిత వైద్య సేవలు,రోజుకు సుమారు 100 మందికి ఈసీజీ, 30 రకాల వైద్య పరీక్షలు,పైగా నెలకు సుమారు రూ.3 లక్షల విలువైన మందులు ఉచితంగా అందజేయడం గమనార్హం
అధికారుల ప్రకారం, ఇవి అన్ని సేవలు కొత్త డిస్పెన్సరీలో కూడా కొనసాగుతాయి. అంతేకాదు, ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల ప్రమోషన్ల అంశంలో కూడా కసరత్తు చేస్తున్నారు,ఇది అంతా ఈమధ్య జరిగిన రోడ్ ప్రమాదం వల్ల డ్రైవర్ ల మీద చూపించే ముందుజాగ్రత్త అని విశ్లేషకులు నమ్మకం.
