APలో పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు 50k హోటల్ గదుల లక్ష్యం

March 26, 2026 11:04 AM

ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి N. Chandrababu Naidu పర్యాటక శాఖకు దిశానిర్దేశం చేశారు.

రాష్ట్రంలో పెరుగుతున్న పర్యాటకుల రద్దీకి అనుగుణంగా 2029 నాటికి 50 వేల హోటల్ గదులు, 10 వేల హోం స్టేలను అందుబాటులోకి తేవాలని సూచించారు. బారువ నుంచి నెల్లూరు వరకు బీచ్‌ల అభివృద్ధి, పర్యాటక సదుపాయాల విస్తరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.అరుకు, గండికోట, సూర్యలంక, బొర్రా గుహలు వంటి ప్రాంతాలను ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సీఎం పేర్కొన్నారు. అలాగే కారావాన్ పార్కులు, టెంట్ సిటీలు ఏర్పాటు చేసి కుటుంబాలతో ప్రకృతి ఆనందించేలా మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.విశాఖ, తిరుపతిలో అమ్యూజ్‌మెంట్ పార్కులు, హెలీ టూరిజం, సీ ప్లేన్‌లు, క్రూజ్ సేవలను ప్రోత్సహించాలని తెలిపారు. గోదావరి పుష్కరాల నాటికి హోం స్టేలు, టెంట్ సిటీలు పెద్ద ఎత్తున అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టారు.పర్యాటక అభివృద్ధి కోసం సీఎస్ అధ్యక్షతన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని, వివిధ శాఖల సమన్వయంతో ప్రాజెక్టులను వేగవంతం చేయాలని సీఎం సూచించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media