ఆంధ్రా యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల ఘర్షణ బంద్‌కు పిలుపు

February 18, 2026 12:52 PM

ఆంధ్రా యూనివర్సిటీ (AU)లో గత రెండు రోజులుగా సాగుతున్న వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఆదివారం వర్సిటీ ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో ఆర్ఎస్ఎస్ (RSS) నేతలు కవాతు నిర్వహించడంపై ఎస్ఎఫ్ఐ (SFI), ఏఐఎస్ఎఫ్ (AISF) నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. యూనివర్సిటీలో మతపరమైన కార్యక్రమాలకు అనుమతి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తూ నేడు రిజిస్ట్రార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు.

ఈ క్రమంలో ఎస్ఎఫ్ఐ ‘ఏయూ బంద్’కు పిలుపునివ్వగా, ఏబీవీపీ (ABVP) నేతలు దానిని వ్యతిరేకిస్తూ భారీగా చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. రంగంలోకి దిగిన వైస్ ఛాన్సెలర్ రాజశేఖర్, ప్రస్తుతం విశాఖలో ‘ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ’, ‘మిలాన్’ ఉత్సవాలు జరుగుతున్నాయని, ఇలాంటి సమయంలో బంద్ నిర్వహిస్తే సహించేది లేదని కఠినంగా హెచ్చరించారు. ప్రస్తుతం వీసీ విద్యార్థి సంఘాల నేతలతో చర్చలు జరుపుతూ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media