అన్నవరం ప్రసాదం బుట్టల్లో ఎలుకల స్వైరవిహారం video

January 24, 2026 12:15 PM

పవిత్రమైన అన్నవరం సత్యదేవుని ప్రసాదం విక్రయ కేంద్రాల్లో భయంకరమైన దృశ్యాలు వెలుగుచూశాయి. వైజాగ్-అన్నవరం హైవే మార్గంలోని ప్రసాదం కౌంటర్లలో రాత్రి వేళ ప్రసాదం బుట్టల నిండా ఎలుకలు తిరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. భక్తుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఈ ఘటనపై ఆలయ యంత్రాంగం తక్షణమే స్పందించింది.

అపరిశుభ్రతపై భక్తులు సిబ్బందిని ప్రశ్నించగా, “ఇంతే ఉంటుంది, ఇష్టమైతే కొనండి లేదంటే వెళ్లిపోండి” అంటూ దురుసుగా సమాధానం ఇచ్చినట్లు సమాచారం.ఈ వీడియో వైరల్ కావడంతో ఆలయ EO త్రినాథరావు విచారణకు ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు సిబ్బందిని (ప్రసాదం ప్యాకర్ మరియు సెక్యూరిటీ సిబ్బంది) తక్షణమే విధుల నుంచి తొలగిస్తూ (సస్పెండ్) ఉత్తర్వులు జారీ చేశారు. ఎలుకలు లోపలికి ప్రవేశించకుండా ప్రసాదం నిల్వ చేసే క్యాబిన్లకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media