నెల్లూరు జిల్లా రాపూరులో డ్రగ్స్ నిర్మూలనకు అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు. ఈనెల 6న తిరుపతి నుంచి ప్రారంభమైన సైకిల్ యాత్ర 13 జిల్లాల మీదుగా 17 రోజుల పాటు కొనసాగి విశాఖపట్నం చేరుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

‘వైబ్రంట్స్ ఆఫ్ కలాం’ ఆధ్వర్యంలో రాపూరులోని గిరిజన గురుకుల పాఠశాల మరియు బాలికల పాఠశాలలో 100 మీటర్ల జాతీయ జెండా ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న నిర్వాహకులు మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమని తెలిపారు.డ్రగ్స్ వల్ల సామాజిక, మానసిక, శారీరక సమస్యలు తలెత్తుతాయని, ఈ సమస్యను అరికట్టేందుకు పాఠశాలలు, కళాశాలల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాపూరు ఎస్ఐ వెంకట రాజేష్, ఎంఈఓలు జి. శ్రీనివాసులు, జిలాని భాష, గిరిజన పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
