పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తాడేపల్లి మండలంలోని ప్రాతూరు, చిర్రావూరు గ్రామాల్లో పర్యటించారు.
ముందుగా ప్రాతూరులోని వంగవీటి రాధాకృష్ణ, వంగవీటి మోహనరంగా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తరువాత రైతులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ:
1) గత ప్రభుత్వంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తించి 4 వేల రైతు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసిన ఘనత కూటమి ప్రభుత్వందని తెలిపారు.
2)దేశంలో ఎక్కడ లేని విధంగా ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే 3 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసే వ్యవస్థను అమలు చేస్తున్నామని అన్నారు.
3)ధాన్యం కొనుగోలుకు 14 వేల కోట్లు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.
4) కేంద్ర ప్రభుత్వాన్ని 17% నుండి 24% వరకు ధాన్యం కొనుగోలు చేయాలంటూ అభ్యర్థించినట్లు తెలిపారు.
చిర్రావూరు రైతు సేవా కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి, రైతులతో సమావేశమై ఇలా చెప్పారు:
1)రైతుల వద్ద ఉన్న ప్రతి బస్తా ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం
2)ప్రభుత్వం రైతుల పక్షానే ఉంటుందని హామీ ఇచ్చారు.
3)51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం.
4) బస్తాకు ₹1792 ధరకు కొనుగోలు.

