బైక్ దొంగతనాల్లో ‘శతకం’ చేసిన గణేశ్ – వీడియోతోనే పోలీసుల వలలో,ఏలూరు జిల్లాలో బైక్ దొంగతనాలపై పోలీసులు ముమ్మర చర్యలు చేపట్టారు. తాజాగా బైక్ చోరీల్లో శతకం చేసిన దులాయ్ గణేశ్ అలియాస్ నాగపవన్, తనే పోలీసులకు సవాల్ విసిరిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పట్టుబడ్డాడు.
S.P ప్రతాప్ శివకిశోర్ వివరాల ప్రకారం, నూజివీడు పరిసర ప్రాంతాల్లో వరుసగా జరుగుతున్న బైక్ దొంగతనాల దర్యాప్తులో గణేశ్ ప్రధాన నిందితుడిగా తేలాడు. “పోలీసులు నన్ను ఏం చేయలేరు” అని చెప్పిన వీడియో ఆధారంగా పోలీసులు అతడిని గుర్తించారు.
ప్రత్యేక బృందం ఐదుగురు సభ్యులతో కూడిన ముఠాను అరెస్ట్ చేసింది.దులాయ్ గణేశ్, షేక్ మెహర్‌బాబా, షేక్ ఆసిఫుల్లా, చిత్తూరి అజయ్‌కుమార్, చౌటపల్లి సుభాష్.పోలీసులు వీరి వద్ద నుంచి 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. దొంగతనాల వెనుక వ్యసనాలు, ఈజీ మనీ కోరిక ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.గణేశ్ “మద్యం మత్తులో వీడియో చేశా” అని చెప్పగా, ఎస్పీ గణేశ్‌ను కఠినంగా హెచ్చరించారు. నిందితులను రిమాండ్‌కు తరలించి, పాత కేసులపై విచారణ కొనసాగుతోంది.


