Ap ACB:ఏపీలో ఏసీబీ దాడులు వేగం

November 6, 2025 12:48 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సోదాలు రెండో రోజూ కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఏసీబీ రాడార్‌లో ఉన్నాయి. ఇప్పటి వరకు 12 కార్యాలయాల్లో అవినీతి, డబుల్ రిజిస్ట్రేషన్లు, డాక్యుమెంట్ ట్యాంపరింగ్ వంటి పెద్ద ఎత్తున అక్రమాలు బయటపడ్డాయి.సోదాల్లో ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి. అధికారులు ఒకేసారి విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కడప, తెనాలి, రాజమండ్రి, విశాఖపట్నం ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.

ఈ దాడుల్లో కీలక పత్రాలు, పెద్దమొత్తంలో నగదు, లెక్కల్లో చూపని రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సోదాలు కొనసాగుతుండగా, మరిన్ని వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media