మాచర్ల నియోజకవర్గం కారంపూడిలో పల్నాటి వీరుల ఉత్సవాల చివరి రోజు విద్యుత్ ప్రమాదం విషాదం సృష్టించింది. కల్లిపాడు కార్యక్రమం అనంతరం నాగులేరు లోని నీటిలో దిగి ఆచారాలు నిర్వహిస్తున్న సమయంలో విద్యుత్ వైర్ నీటిలో పడటంతో ఇద్దరు సాంప్రదాయవాదులు(Traditionalist) షాక్కు గురయ్యారు.
చిలకలూరుపేటకు చెందిన పల్లపు జాల నరసింహం (45) చికిత్స పొందుతూ మృతి చెందగా, ప్రకాశం జిల్లా పుల్లల చెరువు చెందిన అంకారావు పరిస్థితి విషమంగా ఉండటంతో నరసరావుపేటకు తరలించారు.
ఈ ఘటనపై మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి సంతాపం తెలుపుతూ, గాయపడిన అంకారావుకు తక్షణమే మెరుగైన వైద్య సహాయం అందించాలంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఐదు రోజుల పాటు విజయవంతంగా సాగిన పల్నాటి ఉత్సవాల్లో ఇలాంటి దుర్ఘటన జరగడం అత్యంత విచారకరమని ఎమ్మెల్యే అన్నారు.


