అడ్డురోడ్డు కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పాయకరావుపేట నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. సోమవారం నక్కపల్లిలోని హోం మంత్రి వంగలపూడి అనిత నివాసం వద్ద ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు, హోం మంత్రి అనిత చిత్రపటాలకు నాయకులు పాలాభిషేకం చేశారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని, అనితమ్మ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు.తాగేవాటిని అభిషేకం చెయ్యొచ్చు కానీ దేనికి పనికి రాణి రక్తాన్ని చల్లితే violence, కానీ తాగే పాలను మాత్రం వృథా చెయ్యొచ్చు అనేది ఇక్కడ అసలు మాట
ఈ సందర్భంగా పాయకరావుపేట నియోజకవర్గ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ మాట్లాడుతూ అడ్డురోడ్డును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించడం చారిత్రాత్మకమని, ఇందుకోసం కృషి చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, హోం మంత్రి అనితలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.మంత్రి అనిత సారథ్యంలో నియోజకవర్గంలో పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడుతున్నాయని, స్టీల్ ప్లాంట్ బొమ్మల పరిశ్రమతో పాటు మరిన్ని పరిశ్రమలు రానున్నాయని నేతలు పేర్కొన్నారు.మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు (ధర్మశ్రీ) వ్యాఖ్యలపై కూటమి నేతలు మండిపడ్డారు. ఎలమంచిలిలో రెవెన్యూ డివిజన్ కోసం గత ఐదేళ్లు ఏం చేశారని ప్రశ్నించారు. మంత్రి అనితపై కానీ, నియోజకవర్గంపై కానీ అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎస్.రాయవరం మండలం టీడీపీ అధ్యక్షులు అమలంకంటి అబద్ధం మరియు ఇతర కూటమి నేతలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
