పల్నాడు జిల్లా దుర్గి మండలం అడిగొప్పలలో జరిగిన జంట హత్యల కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను దుర్గి పోలీసులు వెల్లడించారు.

ప్రధాన నిందితుడు (A1) యాగంటి నరేష్, పువ్వాడ రామలింగం (A2), ముత్యాల శివ (A3)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితులను పోలీసులు జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ కళ్యాణ్ ఎదుట హాజరుపరిచారు.
కేసు తీవ్రతను పరిశీలించిన న్యాయమూర్తి నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితులను పోలీసులు భారీ భద్రత నడుమ గురజాల సబ్ జైలుకు తరలించారు.
