వాడరేవు దిత్వా తుఫాను (Ditwa Cyclone) ప్రభావంతో ప్రకాశం జిల్లా చీరాల వాడరేవు తీరంలో ఉవ్వెత్తున అలలు ఎగసిపడుతున్నాయి. తీరంలో సుమారు 5 అడుగుల మేర సముద్రం ముందుకు చొచ్చుకువచ్చింది.
తీర ప్రాంతాల మూసివేత: అధికారులు అప్రమత్తమై చీరాల తీర ప్రాంతంలోని వాడరేవు, రామాపురం, పొట్టి సుబ్బయ్యపాలెం, కటారివారిపాలెం బీచ్‌లను ఇప్పటికే మూసివేశారు.
బందోబస్తు: సముద్ర తీరాలకు వెళ్లే మార్గాలలో బారికేడ్లు ఏర్పాటు చేసి, ప్రజలను తీరం వద్దకు అనుమతించకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు.
