ఉపాధ్యాయ అర్హత పరీక్ష (T.E.T) రాయడానికి వెళ్తున్న 18 ఏళ్ల విద్యార్థిని సునీత, తాను ప్రయాణిస్తున్న ఆటో కింద పడి దుర్మరణం పాలైంది. ఈ విషాద ఘటన అనకాపల్లి జిల్లాలోని సుంకరమెట్ట వద్ద జరిగింది.

ఉదయం,సుంకర మెట్ట సమీపంలో సునీత తండ్రి ఆటో నడుపుతూ, మార్గం తెలుసుకునేందుకు గూగుల్ మ్యాప్స్ చూస్తుండగా, ఈ ప్రమాదం జరిగింది. ఆటో నుంచి ప్రమాదవశాత్తు కింద పడిన కూతురిపైనే ఆటో వెళ్లడంతో సునీత అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. కూతురు కళ్లెదుటే ప్రాణాలు కోల్పోవడంతో తండ్రి కుప్పకూలిపోయాడు. పరీక్షకు వెళ్తూ కుమార్తె మృతి చెందడం ఆ ప్రాంతంలో విషాదఛాయలు నింపింది.
