తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం రాజానగరం ఐసీడీఎస్ (ICDS) ఆఫీసు ముందు రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎం. మార్తా, పి. సుజాత నేతృత్వంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది.
అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాలి,సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలి,వేతనంతో కూడిన మెడికల్ లీవులు మంజూరు చేయాలి.’తల్లికి వందనం’ పథకాన్ని అంగన్వాడీ పిల్లలకు కూడా వర్తింపజేయాలి.పెండింగ్లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే సరుకుల నాణ్యత, పరిమాణాన్ని పెంచాలి.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి బి.వి.ఎన్. పూర్ణిమ రాజు మాట్లాడుతూ.. కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మే నెల అంతా అంగన్వాడీలకు వేసవి సెలవులు ఇస్తూ తక్షణమే జీవో విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెక్టార్ నాయకులు జి. సుజాత, పి. వెంకటలక్ష్మి, వై. ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.
