AP:దుర్గమ్మ చెంత ఏపీ సీఎస్ విజయానంద్

February 24, 2026 11:24 AM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Chief Secretary) కె. విజయానంద్ మంగళవారం కుటుంబ సమేతంగా విజయవాడ ఇంద్రకీలాద్రిని సందర్శించారు. కొలువై ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

ఆలయానికి చేరుకున్న సీఎస్ దంపతులకు దేవస్థానం కార్యనిర్వహణాధికారి (EO) వి.కె. శీనా నాయక్ ఘనస్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు పర్యవేక్షించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, వేద పండితులు సీఎస్ కుటుంబానికి ఆశీర్వచనం అందజేశారు.ఈఓ శీనా నాయక్ అమ్మవారి శేష వస్త్రం, చిత్రపటం మరియు ప్రసాదాన్ని సీఎస్ విజయానంద్‌కు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media