ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుల దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేసిన చొరవ ఫలించి, రాష్ట్రంలోని క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ రూ. 60.76 కోట్ల నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
నిధుల కేటాయింపు వివరాలు:
శ్రీకాకుళం (పాత్రునివలస): ఇండోర్ హాల్ నిర్మాణం కోసం రూ. 14 కోట్లు.
చిత్తూరు (కుప్పం): బహుళ ప్రయోజన భవన సముదాయం కోసం రూ. 14 కోట్లు.
గుంటూరు: మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం రూ. 14 కోట్లు
రాజమండ్రి: ఇండోర్ స్టేడియం నిర్మాణం కోసం రూ. 13.76 కోట్లు.
విజయవాడ (ఇందిరాగాంధీ స్టేడియం): సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్: రూ. 9.50 కోట్లు.
ఫుట్బాల్ గ్రాస్ ఫీల్డ్: రూ. 6 కోట్లు.
Tennis కోర్ట్: రూ. 1.50 కోట్లు.
బాస్కెట్ బాల్ కోర్ట్, ఫ్లడ్ లైట్లు మరియు ఇతర వసతులు: రూ. 2 కోట్లు.

కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయతో రామ్మోహన్ నాయుడు ఈ నెల 6న జరిపిన భేటీ అనంతరం ఈ నిధులు విడుదలయ్యాయి. ఖేలో ఇండియా (Khelo India) పథకం కింద ఈ నిధులను కేటాయించారు.
