ప్రస్తుత శీతాకాలంలో అరకులోయ కొత్త అందాలతో పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఎత్తైన పర్వతాలు, పచ్చదనం, దట్టమైన పొగమంచు, వలిసే పూల సోయగాలు సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.
1)మాడగడ సన్రైజ్ పాయింట్ – పాల సముద్రాన్ని తలపించే తెల్లటి మంచు దృశ్యాలు
2)గిరిజన మ్యూజియం – గిరిజన సంప్రదాయాల ప్రతిబింబం
3)పద్మాపురం ఉద్యానవనం – ప్రసిద్ధి చెందిన బొటానికల్ గార్డెన్
ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపు పడిపోవడంతో అరకు చలి పర్యాటకులను గజగజలాడించినా, అదే సమయంలో వాతావరణాన్ని మరింత రొమాంటిక్గా మార్చుతోంది. కెమెరాలతో అరకు అందాలను బంధిస్తూ పర్యాటకులు ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తున్నారు.
అరకులోయలో ఈ సీజన్ వెడ్డింగ్ షూట్లు, పుట్టినరోజు వేడుకలతో సందడి వాతావరణం నెలకొంది.


