పార్వతీపురం మన్యం జిల్లా విద్యావ్యవస్థలో సంస్కరణల దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గురువారం భామినిలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ (PTM)లో పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యార్థులకు ఇచ్చిన లెర్నింగ్ టూల్స్‌ను స్వయంగా పరిశీలించారు. లెర్నింగ్ టూల్స్ ద్వారా విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించి, వారికి ఎలా నేర్చుకోవాలో వివరించారు.
విద్యా శాఖలో అమలు చేస్తున్న వివిధ సంస్కరణల గురించి మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రికి వివరించారు.

పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్ సామర్థ్యాలను పెంచేందుకు వీలుగా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి విద్యాశాఖను ఆదేశించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించి, వారి తల్లిదండ్రులతో స్వయంగా మాట్లాడారు.

విద్యతో పాటు విద్యార్థులలో వివిధ నైపుణ్యాలను (Skills) పెంచే దిశగా ఉపాధ్యాయులు పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

