ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తగరపువలసలోని అవంతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీలో మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ సహకారంతో భారీ అవగాహన మరియు ఉచిత స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించారు. “యునైటెడ్ బై యూనిక్యూ” అనే థీమ్‌తో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులకు క్యాన్సర్ నివారణపై నిపుణులు దిశానిర్దేశం చేశారు.
సదస్సులో భాగంగా రక్తపోటు (BP), షుగర్ (RBS), ఈసీజీ, మరియు మహిళల కోసం పాప్ స్మియర్ వంటి పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. మెడికోవర్ ఆంకాలజిస్టులు డా. విద్యాసాగర్ దూసి, డా. అభిలాష్ గయరాజు, డా. లకిత్య శర్మ ప్రథంశెట్టి పాల్గొని క్యాన్సర్ సవాళ్లపై ప్రసంగించారు. ముఖ్యంగా స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ పట్ల అవగాహన, ముందస్తు స్క్రీనింగ్ ప్రాముఖ్యతను వైద్యులు వివరించారు. మత్తు పదార్థాలు, ధూమపానం, మద్యపానం వల్ల కలిగే ప్రాణాంతక క్యాన్సర్ల గురించి విద్యార్థులను హెచ్చరించారు.క్యాన్సర్‌పై అవగాహన, సానుభూతితో అందరూ ఒక్కటై ఈ వ్యాధిని ఎదుర్కోవాలని వైద్యులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, మెడికవర్ ప్రతినిధులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
