శబరిమల యాత్రలో భక్తులపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎపి బిజెపి అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ డిమాండ్ చేశారు. కేరళ ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం శబరిమల పవిత్రతను దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తోందని ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.
భక్తుల కష్టాలను పట్టించుకోకుండా, అవసరమైన ఏర్పాట్లు చేయడంలో కేరళ ప్రభుత్వం విఫలమైందని మాధవ్ అన్నారు. అయ్యప్ప సేవా సంఘం, అమృతానందమయి మఠం వంటి సంస్థలను సేవ కార్యక్రమాలకు దూరం చేస్తున్నది హిందువుల పట్ల ప్రభుత్వ వ్యతిరేక ధోరణికి నిదర్శనమని పేర్కొన్నారు.
భక్తుల సమస్యలకు కేరళ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలని మాధవ్ డిమాండ్ చేస్తూ, ఎల్‌డీఎఫ్ శబరిమల పవిత్రతను దెబ్బతీయడానికి కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యాలయం నుంచి మాధవ్ వీడియో ప్రకటన విడుదలైంది.సొంత ap రాష్ట్రం లో తొక్కిసలాట జరిగినప్పుడు ,కల్తీ లడ్డు స్కాం , గుడిలో గోడలు కూలినప్పుడు పట్టించుకోని ఈ cheif of AP ఇప్పుడు అక్కడ ఎక్కడో సబిరిమలై లో జరిగిన అన్యాయం గురించి మాట్లాడడం అవసరమా అని అడుగుతున్నారు ప్రజలు
