AP :అమరావతికి కేంద్రం భరోసా: నిర్మలమ్మ వరాలు

November 28, 2025 4:11 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగం

రాజధాని నిర్మాణం & ఆర్థిక భరోసా

రీస్టార్ట్’పై హర్షం ఏపీ రాజధాని అమరావతిని రీస్టార్ట్ చేయడం సంతోషకరం. కొత్త రాజధాని నగరాన్ని నిర్మించడం ఒక యజ్ఞం లాంటిది.ప్రధాని సహకారం నిర్మాణ పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీ పూర్తిగా సహకరిస్తున్నారు.15 పీఎస్‌యూ సంస్థలు ఇంత పెద్ద నగరానికి ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో 15 ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థలు ఇక్కడ ప్రధాన కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాయి.

రైతులు & బ్యాంకుల పాత్ర

రైతుల త్యాగం రాజధాని నిర్మాణంలో రైతుల త్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు.రుణ పరిధి విస్తరణ బ్యాంకులు కేవలం కిసాన్ క్రెడిట్ కార్డుల (KCC) ద్వారా రుణాలు ఇవ్వడానికే పరిమితం కాకుండా, రైతుల ఆర్థిక ప్రయోజనాలను పెంచాలి.ఉద్యాన ఉత్పత్తులు రాయలసీమలోని ఉద్యాన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు, ప్యాకింగ్, కోల్డ్ చైన్ పరిశ్రమల ప్రోత్సాహానికి బ్యాంకులు సహకరించాలి.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక మద్దతు

విభజన కష్టాలు విభజన తర్వాత ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఏపీకి పూర్తిగా సహకరించాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

సాంకేతికత & సైన్స్ క్వాంటం వ్యాలీ, ఏఐ ప్రాజెక్టుల కోసం జిల్లాల్లో ఏఐ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ ఒప్పందం చేసుకోవడం సంతోషకరం.ఏపీలో కాస్మోస్ ప్లానెటోరియం నిర్మించాలని ఆమె కోరారు.

ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్ రాబోయే ఏడాదిన్నరలో అమరావతి ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్ నగరంగా మారుతుందని సీతారామన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

రేర్ ఎర్త్ మినరల్స్ రేర్ ఎర్త్ మినరల్స్ (REM) రంగంలో కూడా ఏపీ పనిచేయాలని ఆమె కోరారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media