శ్రీనివాసపురం (ఆంధ్ర-కర్ణాటక బార్డర్): కడప నుంచి బెంగళూరుకు వెళ్తున్న హరిత ట్రావెల్స్ బస్సు డివైడర్‌ను ఢీకొని బోల్తా పడటంతో ఒక మహిళ మృతి చెందగా, 10 మందికి పైగా గాయాలయ్యాయి.
ఆంధ్ర-కర్ణాటక బార్డర్‌లోని శ్రీనివాసపురం తాలూకా, రాయల్పాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని మంచినీళ్ల కోట్ వద్ద మంగళవారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో ప్రొద్దుటూరుకు చెందిన అనిత (58) మృతి చెందారు.
గాయపడిన వారిలో కడప, రాయచోటి, బెంగళూరుకు చెందినవారు ఉన్నారు. తీవ్రంగా గాయపడ్డ నలుగురిని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.
ఈ ప్రమాద ఘటనపై రాయల్పాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
