కలిసి పనిచేస్తేనే లక్ష్య సాధ్యం: CS G. సాయి ప్రసాద్

March 11, 2026 1:19 PM

Amaravatiలో జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి G. Sai Prasad అధికారులకు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ ఆశయాలు సాధించేందుకు అధికారులు కలిసి పనిచేసి ఫలితాలు సాధించాలని సూచించారు.

రాష్ట్రాన్ని 2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. అలాగే తలసరి ఆదాయాన్ని రూ.55 లక్షలకు పెంచే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా అందేలా వాట్సాప్ గవర్నెన్స్ (మనమిత్ర) వినియోగాన్ని పెంచాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. పెట్టుబడులను ఆకర్షించేలా సంస్కరణలు అమలు చేయాలని, ప్రైవేట్ రంగాన్ని పాలనలో భాగస్వామ్యం చేయాలని కూడా అన్నారు.అమరావతిలో ఏర్పాటు చేస్తున్న క్వాంటం వ్యాలీ కంప్యూటింగ్ రంగంలో దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media