దివంగత మాజీ ఎంపీ డీకే ఆదికేశవులు నాయుడు కుమారుడు శ్రీనివాస్, కుమార్తె కల్పజలను సీబీఐ (CBI) అధికారులు సోమవారం అరెస్టు చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త రఘునాథ్ అనుమానాస్పద మృతి కేసులో వీరిద్దరినీ అదుపులోకి తీసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది.2019 మే 4న వ్యాపారవేత్త రఘునాథ్ మరణించారు. తన భర్త మృతికి శ్రీనివాస్ మరియు ఇతరులే కారణమని ఆయన భార్య మంజుల ఫిర్యాదు చేశారు. 2020 నుంచి కొనసాగుతున్న ఈ కేసు విచారణను సీబీఐ చేపట్టింది. విచారణలో భాగంగా పక్కా ఆధారాలు సేకరించిన అధికారులు తాజాగా చార్జిషీట్ దాఖలు చేశారు.

కేవలం హత్యే కాకుండా సాక్ష్యాలను నాశనం చేయడం, పత్రాలను ఫోర్జరీ చేయడం, ప్రభుత్వ స్టాంపులు మరియు సీళ్లను అక్రమంగా సృష్టించడం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద సీబీఐ కేసులు నమోదు చేసింది.
సీబీఐ కోర్టు ఆదేశాల మేరకు శ్రీనివాస్, కల్పజలతో పాటు ఈ కేసులో సంబంధం ఉన్న మరికొందరిని కూడా అధికారులు అరెస్ట్ చేశారు
