చిత్తూరు నగరం సమీపంలోని ఇరువారం వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురుగా వస్తున్న కారుపై ట్రిప్పర్ లారీ బోల్తా పడటంతో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు.
పలమనేరు వైపు వేగంగా వెళుతున్న ట్రిప్పర్ లారీ, ఇరువారం వద్దకు రాగానే నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న కారుపైకి ఒరిగింది.లారీ భారానికి కారు పూర్తిగా నలిగిపోయింది. కారు డ్రైవర్ వాహనం లోపలే చిక్కుకుపోయి ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ సీఐ నిత్యబాబు సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకున్నారు. జేసీబీ మరియు స్థానికుల సాయంతో కారును కట్ చేసి మృతదేహాన్ని వెలికితీశారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఎక్కడి వాడు అనే వివరాలు తెలియాల్సి ఉంది.

