చిత్తూరు జిల్లా, పూతలపట్టు మండలం, అమ్మేపల్లి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న రైలు పట్టాలు దాటుతున్న ఆవుల మందను ఢీకొంది.
ఈ ప్రమాదంలో మొత్తం 13 ఆవులు మృతి చెందాయి. కలికిరి కొండ దేవస్థానానికి చెందిన 10 ఆవులు అమ్మేపల్లి వద్ద, మరో 3 ఆవులు సామనత్వం(crossing) వద్ద రైలు ఢీకొనడంతో మరణించాయి.
దుర్ఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న కొంతమంది స్థానికులు, మృతి చెందిన ఆవుల మాంసాన్ని కట్ చేసుకుని తీసుకెళ్లిన ఘటన కలకలం రేపింది.
ఈ ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
