AP:రాజంపేట మన్నూరు CI లింగప్ప బాధ్యతల స్వీకరణ

February 12, 2026 2:09 PM

కడప జిల్లా రాజంపేట పరిధిలోని మన్నూరు U/G పీస్ సీఐగా లింగప్ప బాధ్యతలు చేపట్టారు. గురువారం ఆయన స్థానిక కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం సిబ్బందితో సమావేశమయ్యారు.
సీఐ లింగప్పకు గతంలో ఉమ్మడి కడప మరియు అన్నమయ్య జిల్లాల్లో వివిధ ప్రాంతాలలో సీఐగా పనిచేసిన అపారమైన అనుభవం ఉంది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజంపేట ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపీట వేస్తానని, అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా నిరంతరం పర్యవేక్షిస్తానని స్పష్టం చేశారు. బాధితులు ఎవరైనా నిర్భయంగా వచ్చి తనను కలవవచ్చని, ప్రజా సమస్యల పరిష్కారానికి పోలీసు శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు.అనుభవజ్ఞుడైన అధికారి లింగప్ప బాధ్యతలు చేపట్టడం పట్ల స్థానికులు మరియు పోలీసు సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media