AP:CID అధికారులకు డీజీపీ కమాండేషన్ మెడల్స్

January 21, 2026 6:29 PM

AP పోలీస్ విభాగంలో, ముఖ్యంగా సీఐడీలో విశేష ప్రతిభ కనబరిచిన నలుగురు అధికారులకు డీజీపీ కమాండేషన్ డిస్క్ (బ్రాంజ్ మెడల్) పురస్కారాలు లభించాయి. బుధవారం మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఐడీ డీజీ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్ చేతుల మీదుగా ఈ మెడల్స్ మరియు ప్రశంసా పత్రాలను విజేతలకు అందజేశారు.

పురస్కార గ్రహీతలు:

రామిశెట్టి మధు బాబు: ఇన్‌స్పెక్టర్, సైబర్ క్రైమ్స్ (సీఐడీ హెడ్ క్వార్టర్స్).

శ్రీమతి Ch. మణికంఠ: సబ్ ఇన్‌స్పెక్టర్ (సీఐడీ హెడ్ క్వార్టర్స్).

ఈ. రామ్మోహన్ రెడ్డి: హెడ్ కానిస్టేబుల్ 525 (సీఐడీ కంట్రోల్ రూమ్).

యు. పెద్ద మాలకొండయ్య: పిసి, ఆర్‌వో (నెల్లూరు).

సీఐడీలో పనిచేసే సిబ్బంది సేవలను ప్రభుత్వం గుర్తిస్తుందని, భవిష్యత్తులో మరిన్ని మెడల్స్ సాధించేలా కృషి చేయాలని డీజీ రవిశంకర్ అయ్యన్నార్ పిలుపునిచ్చారు. దేశంలో సైబర్ నేరాలను అరికట్టడంలో సీఐడీ వినూత్న పద్ధతుల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తూ నేరస్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటోందని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్పీలు అధిరాజ్ సింగ్ రానా, కేవీ శ్రీనివాసరావు, కే. చక్రవర్తి, ఎస్. శ్రీధర్ మరియు సైబర్ క్రైమ్ డీఎస్పీ డాక్టర్ బి. రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media