ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు, రాష్ట్ర ఐటీ & పంచాయతీరాజ్ మంత్రి నారా లోకేష్ గారికి పట్నా విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.
విమానాశ్రయానికి చేరుకున్న ఇద్దరు నేతలను అధికారులు, ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు అంగరంగ వైభవంగా ఆహ్వానించారు. పుష్పగుచ్ఛాలు అందించి, నినాదాలతో నాయకులకు స్వాగతం పలికారు.
బీహార్ పర్యటనలో భాగంగా జరిగే సమావేశాలు, కార్యక్రమాల్లో వారు పాల్గొననున్నట్టు సమాచారం.




