ఆంధ్రప్రదేశ్‌లో మరో మెగా పెట్టుబడి రానుంది. ప్రముఖ ఎనర్జీ సంస్థ రెన్యూ పవర్ రాష్ట్రంలో రూ. 82 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఐదేళ్ల తర్వాత ఈ సంస్థ మళ్లీ ఏపీలో అడుగు పెడుతోంది.
ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌లో సోలార్ సెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, 6MW ఉత్పత్తి సామర్థ్యం, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం, గ్రీన్ హైడ్రోజన్ తయారీ యూనిట్లు ఉండనున్నాయి.
ఈ పెట్టుబడులు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగావకాశాలు సృష్టించడమే కాకుండా దీర్ఘకాలిక పన్ను ఆదాయం అందిస్తాయని మంత్రి తెలిపారు. గూగుల్ పెట్టుబడికంటే ఇది పది రెట్లు మెరుగైన పెట్టుబడిగా ఆయన వ్యాఖ్యానించారు.
