అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టం (FBMS) పై సమీక్ష నిర్వహించారు. రియల్‌టైమ్ గవర్నెన్స్ డేటా ద్వారా వివిధ సంక్షేమ పథకాలు, పౌర సేవల అమలు స్థితిని పర్యవేక్షించడానికి ప్రభుత్వం ఈ సిస్టంనిస్తున్నది.

విభిన్న ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని సమన్వయపరచి FBMS వ్యవస్థను ప్రవేశపెట్టే లక్ష్యంతో, సమీక్షకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, ఆర్ధిక, వైద్యారోగ్యం, పౌరసరఫరాలు, పురపాలక, ఐటీ, ప్లానింగ్ విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

