DR B.R.అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం గ్రామంలో నిర్వహించిన ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూ యజమానులకు క్యూఆర్ కోడ్ (QR Code) తో కూడిన ఆధునిక పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో భూ రికార్డుల్లో జరిగిన అవకతవకలను సరిదిద్ది, రైతులకు శాశ్వత భూ హక్కు కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని సీఎం పేర్కొన్నారు.

భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకతను పెంచామని, రైతుల భూమికి ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి దూరదృష్టితో చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల కోనసీమ రైతాంగానికి పెద్ద ఉపశమనం లభిస్తుందని అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి కొనియాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

