మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు.. పెద్దాయన్ను కలిశారు!!

June 8, 2026 11:44 PM
cbn-with-fan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు 96 ఏళ్ల వృద్ధుడి కోరికను నెరవేర్చారు. పశ్చిమ గోదావరి జిల్లా కామధేనువులంక గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే వృద్ధుడు, తన అభిమాన నేత అయిన చంద్రబాబును కలవాలని సోషల్ మీడియాలో చెప్పిన వీడియో వైరల్ అయింది. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి ఆయన్ను ప్రత్యేకంగా కలుసుకున్నారు.

సత్యనారాయణను చంద్రబాబు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని, ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన నూరేళ్లు నిండు ఆరోగ్యంతో జీవించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఆచంట నియోజకవర్గంలోని సిద్ధాంతం గ్రామంలో నిర్వహించిన ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media