స్వర్ణాంధ్ర విజన్ 2047′ లక్ష్య సాధనలో భాగంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిపోయిన పెండింగ్ పనులన్నింటినీ తక్షణమే పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
దేశవ్యాప్తంగా మెటీరియల్ కాంపోనెంట్ కింద అత్యధికంగా నిధులు ఖర్చు చేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచిందని అధికారులు సీఎంకు వివరించారు. వచ్చే ఏడాది నుంచి అమలు కానున్న ఈ కొత్త పథకాన్ని గ్రామీణ అభివృద్ధి పనులతో అనుసంధానించాలని సీఎం సూచించారు.ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో సౌర విద్యుత్ వ్యవస్థలు, గ్రంథాలయాలు, జల్ జీవన్ మిషన్ మరమ్మతులు, కమ్యూనిటీ ఆస్తుల నిర్మాణం మరియు ప్రకృతి విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి, గ్రామీణ జీవన ప్రమాణాలను పెంచేలా ఈ కార్యాచరణను రూపొందించాలని సీఎం దిశానిర్దేశం చేశారు.
