పల్నాడు జిల్లా వినుకొండలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, పట్టణ పరిశుభ్రత కోసం రూపొందించిన స్వచ్ఛ రథాలను జెండా ఊపి ప్రారంభించారు.

అనంతరం ప్రజావేదిక వద్ద ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. రాష్ట్ర అభివృద్ధి, పరిశుభ్రతపై తన విజన్‌ను వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్ మరియు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

