ఆంధ్రప్రదేశ్‌లో ఇటాలియన్ కంపెనీల పెట్టుబడులు పెంచేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటలీ రాయబారి ఆంటోనియో ఎన్రికో బార్టోలీని కోరారు.
విశాఖలో జరుగుతున్న CII పార్టనర్‌షిప్ సదస్సు సందర్భంగా జరిగిన ఈ భేటీలో, ఆటోమోటివ్, యంత్రాల తయారీ, పునరుత్పాదక ఇంధనం, ఫ్యాషన్, ఆహార ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులపై చర్చించారు.
ఏపీ–ఇటలీ మధ్య దీర్ఘకాలిక వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు రాష్ట్రంలో ఇటాలియన్ ఇండస్ట్రీయల్ క్లస్టర్ ఏర్పాటు విషయంపైనా చర్చలు జరిగాయి.


