ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలోని ఆర్టీజీఎస్ (RTGS) కేంద్రంలో అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖలు అందిస్తున్న పౌర సేవలపై ప్రజల్లో ఉన్న ‘పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్’ గురించి ఈ సందర్భంగా చర్చ జరిగింది.
ప్రజల నుంచి వస్తున్న సమాచారాన్ని విశ్లేషించి, మరింత మెరుగ్గా సేవలు అందించాలని ప్రభుత్వ శాఖలను సీఎం ఆదేశించారు.
సమాచార మాధ్యమాల్లో వచ్చిన వివిధ అంశాలపై వెంటనే స్పందించి చర్యలు చేపట్టేలా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ప్రజలకు సంబంధించిన అంశాల్లో ఎక్కడా రాజీకి అవకాశం లేదని సమీక్షలో ముఖ్యమంత్రి గట్టిగా పేర్కొన్నారు.
