విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్‌లో పాల్గొనడానికి వచ్చిన ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన అల్పాహార విందులో గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, మంత్రి నారా లోకేష్‌తో పాటు ఇతర మంత్రులు పాల్గొన్నారు.


