AP CM :బాబు గారు వార్నింగ్

November 17, 2025 5:50 PM

పరిశ్రమల విషయంలో వైసీపీకి మాట్లాడే హక్కే లేదని టీడీపీ వర్గాలు తీవ్రస్థాయిలో విమర్శించాయి. వైసీపీ హయాంలో ఉద్యోగ అవకాశాలు సృష్టించకపోగా, 4,100 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు గురయ్యారని ఆరోపించారు. యువతను డ్రగ్స్‌ వైపు నడిపించిందని, పరిశ్రమలను తరిమికొట్టిందని టీడీపీ నేతలు మండిపడ్డారు.

వైసీపీ హయాంలో

కదిరిలో గొడ్డలి పరిశ్రమ, పులివెందులలో బాంబుల పరిశ్రమలను ప్రోత్సహించారని ఆరోపణ.

కియా ప్రతినిధులను బెదిరించడంతో కియా అనుబంధ సంస్థలు వెళ్లిపోయాయని విమర్శ.

ఉత్తరాంధ్ర నుంచి లులు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థలు వెనక్కి వెళ్లిపోయాయని ఆరోపణ.

రాయలసీమలో అమర రాజా, కియా అనుబంధ కంపెనీలను వేధించారని టీడీపీ వ్యాఖ్య.

కూటమి ప్రభుత్వం వచ్చాక

లోకేష్ కృషితో గూగుల్ సహా అనేక ఐటీ కంపెనీలు ఉత్తరాంధ్రలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి.

రాయలసీమలో సోలార్ ప్లాంట్‌, డ్రోన్ మెన్యుఫాక్చరింగ్ యూనిట్లతో సహా ₹4.5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని తెలిపారు.

అమరావతిలో ₹48,000 కోట్లు పెట్టుబడులు, క్వాంటం వ్యాలీ–ఇతర సంస్థల రాక చంద్రబాబు కృషి ఫలితమని పేర్కొన్నారు.

విశాఖ CII సమ్మిట్ ఫలితాలు

12 రంగాల్లో ₹13 లక్షల కోట్లు పెట్టుబడులు.

613 ఎంఓయూలతో 16 లక్షల ఉద్యోగాలు సృష్టి.

కర్నూలులో డ్రోన్ సిటీ, తిరుపతి–అన్నమయ్య జిల్లాల్లో స్పేస్ సిటీ ప్రాజెక్టులతో రాయలసీమకు 60,000 ఉద్యోగాలు.

ఉత్తరాంధ్రలో గూగుల్ డేటా సెంటర్‌తో సహా ఐటీ రంగంలో భారీ అవకాశాలు.

రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, యువగళంలో ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ పనిచేస్తున్నారని టీడీపీ పేర్కొంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media