సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైద్యారోగ్య శాఖతో సమీక్ష నిర్వహించారు. కుప్పంలో సంజీవని ప్రాజెక్టు, యూనివర్శిటీ హెల్త్ స్కీమ్ అమలు అంశాలపై చర్చ జరిగింది.
ఈ శాఖ జనవరి నుంచి చిత్తూరు జిల్లాలో సంజీవని ప్రాజెక్టును ప్రారంభించి, అనంతరం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల మెడికల్ కాలేజీల నిర్మాణం, పీపీపీ ప్రాతిపదికన బోధనా ఆసుపత్రుల అభివృద్ధిపై కూడా సమీక్షలో చర్చించారు.
ప్రభుత్వం విద్యార్థులు, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ ప్రాజెక్టులను పీపీపీ మోడల్‌లో అమలు చేస్తోంది. ఈ విధానంతో బోధనాసుపత్రులు వేగంగా అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు.
