తెనాలి, గుంటూరు జిల్లా: తెనాలిలోని పడవల కాలువలో బుధవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వృద్ధురాలి మృతదేహం కనిపించింది. ఎగువ ప్రాంతం నుంచి కొట్టుకువచ్చిన మృతదేహం ఆలపాటి వారధి వద్ద చెట్ల కొమ్మలకు చిక్కుకొని ఆగిపోయింది.
బోర్లా పడి ఉండడంతో మహిళ గుర్తింపు ఇప్పటికీ తెలియలేదు. కాలువలో మృతదేహం కనిపించడంతో అక్కడి వంతెన వద్ద ప్రయాణికులు ఆసక్తిగా గుమిగూడారు. పోలీసులకు సమాచారం అందించగా, కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
