తెనాలి యానాది కాలనీకి చెందిన కందుకూరి ఉష (38)పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఒంటిపై విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆమె పరిస్థితి విషమించింది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అనంతరం పరిస్థితి తీవ్రంగా ఉండటంతో గుంటూరు ప్రభుత్వం ఆసుపత్రికి మార్గదర్శనం చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

