APలో దివ్యాంగశక్తి పథకం ప్రారంభం: CM, Dycm, మంత్రి lokesh

March 18, 2026 2:21 PM

రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు “దివ్యాంగశక్తి” పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కల్పించనుంది.

సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. 21 కేటగిరీల్లో 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఈ పథకం వర్తిస్తుంది.సహాయకులతో కలిపి సుమారు 12.76 లక్షల మంది లబ్ధిదారులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరనుంది.దివ్యాంగుల ప్రయాణాన్ని సులభతరం చేయడంతో పాటు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.ఈ పథకం అమలుకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం సుమారు రూ.207 కోట్లు వెచ్చించనుంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media