ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి అమలాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. “మేము దస్తావేజుకు ఏరోజుకారోజు వాటాలు పంపిస్తున్నాం.. మా పని ఎందుకు చేయరు?” అంటూ ఒక దస్తావేజు లేఖరి ఏకంగా అధికారులపైనే దాడికి దిగడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది.
సాధారణంగా లంచాల వ్యవహారం గుట్టుగా జరుగుతుంది. కానీ, ఇక్కడ దస్తావేజు లేఖరి నేరుగా అధికారుల వద్దకు వచ్చి తాము ఇస్తున్న మామూళ్ల గురించి ప్రస్తావిస్తూ బెదిరింపులకు దిగడం గమనార్హం. రిజిస్ట్రేషన్ శాఖలో డాక్యుమెంట్ రైటర్ల ద్వారా భారీగా అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని ఏసీబీ అధికారులు గతంలోనే నివేదికలు ఇచ్చారు. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారలేదని ఈ ఘటన నిరూపిస్తోంది. విధుల్లో ఉన్న ప్రభుత్వ అధికారులను, సిబ్బందిని ఒక ప్రైవేట్ వ్యక్తి బెదిరించడం చట్టరీత్యా నేరం. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా రిజిస్ట్రేషన్ శాఖలో పారదర్శకత పెంచాలని, అవినీతికి పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు
