అమరావతిలో 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పునర్నిర్మాణం, ప్రజా రాజధాని అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం ఎనలేనిదని ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

ఆర్థిక కేంద్రంగా అమరావతి: బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసీ వంటి 15 ప్రధాన సంస్థల కార్యాలయాలు ఒకేచోట ఏర్పాటు కావడం చారిత్రక అడుగు. ఈ ‘బ్యాంకింగ్ స్ట్రీట్’ ద్వారా అమరావతి ఆర్థిక కేంద్రంగా అవతరిస్తుంది.
పెట్టుబడులు, ఉపాధి: ఈ ప్రాజెక్టుల ద్వారా రాజధానికి రూ.1,328 కోట్ల పెట్టుబడులు రానుండగా, సుమారు 6,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

రైతుల త్యాగం పునాది: రాష్ట్ర భవిష్యత్తు కోసం 34,915 ఎకరాల భూములు ఇచ్చిన రైతుల నమ్మకమే అమరావతి నగరానికి పునాది అని ఆయన అన్నారు.
కేంద్ర సాయం హైలైట్స్:
విశాఖలో రూ.2 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు (7.5 లక్షల ఉద్యోగాలు).
పోలవరానికి రూ.12,500 కోట్లు, రాజధాని నిర్మాణానికి రూ.15 వేల కోట్లు కేంద్రం ఆర్థిక సాయం అందించింది.

జవాబుదారీతనం: కేంద్రం నుంచి వస్తున్న ఆర్థిక సాయం కాగితాల లెక్కల్లో కరిగిపోకుండా, అభివృద్ధి అందరికీ కనిపించేలా జవాబుదారీతనంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు
