అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని మారేడుమిల్లి మండలంలో 24 గంటలు గడవక ముందే మరోసారి భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. 19.11.2025 ఉదయం తెల్లవారుజామున జీఎం వలస గ్రామం సమీప అటవీ ప్రాంతాల్లో పోలీసులు – మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడు మంది మావోయిస్టులు మరణించినట్లు సమాచారం. వీరిలో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నట్లు తెలుస్తోంది.
మృతుల్లో గుర్తించినవారు:
మెట్టూరి జోగారావు @ టెక్ శంకర్
AOBSZCM & AOBSZC CCM (I/C)
సీతా @ జ్యోతి
DVCM, AOBSZC
అదనంగా AOBSZC కు చెందిన మరో ఐదుగురు ACMలు కూడా మృతులైనట్లు ప్రాథమిక సమాచారం.
పరిసర ప్రాంతంలో పోలీసులు కాంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అధికారుల నుండి పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.

