ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే హోటల్ యజమానులపై కాకినాడ జిల్లా యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఫుడ్ సేఫ్టీ, తూనికలు కొలతలు మరియు సివిల్ సప్లై అధికారులు సంయుక్తంగా నగరంలోని పలు హోటళ్లపై దాడులు నిర్వహించారు.
వివేకానంద పార్కు ఎదురుగా ఉన్న సీజన్-5 హోటల్‌ను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అపరిశుభ్రంగా ఉన్న వంటగదులను చూసి ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు, యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.స్టోర్ రూమ్‌లో ఉన్న ఎక్స్‌పైరీ డేట్ ముగిసిన ఉత్పత్తులను వెంటనే తొలగించారు. రంగులు కలిపిన ఆహార పదార్థాలు, సాస్ బాటిళ్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు పెరుగుపై అనుమానం రావడంతో వాటి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. ల్యాబ్ రిపోర్టులో కల్తీ అని తేలితే హోటల్ లైసెన్స్ రద్దు చేయడమే కాకుండా భారీ జరిమానా విధిస్తామని సివిల్ సప్లై అధికారి సత్యనారాయణ రాజు, ఫుడ్ సేఫ్టీ అధికారి కేశవ ప్రసాద్ హెచ్చరించారు.ఇకపై కాకినాడలో తరచుగా ఆకస్మిక దాడులు కొనసాగుతాయని, హోటల్ యజమానులు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని లేనిచో చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు.
